కరోనాతో మంత్రి మృతి
దిశ,వెబ్ డెస్క్ : కరోనా కాటుకు ఎంతో మంది రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు బలవుతున్నారు. తాజాగా మరో రాజకీయ నాయకుడు కరోనా కాటుకు బలి అయ్యాడు. ఉత్తరప్రదేశ్ రెవెన్యూ, వరద నియంత్రణ మంత్రి విజయ్ కశ్యప్(56) కరోనాతో మృతి చెందారు. ఆయనకు గత కొన్ని రోజుల క్రితం కరోనా పాజివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన అత్యవసర చికిత్స నిమిత్తం గురుగావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. తన ఆరోగ్యపరిస్థితి క్షీణిచడంతో ఆసుపత్రిలోనే మంగళవారం […]
దిశ,వెబ్ డెస్క్ : కరోనా కాటుకు ఎంతో మంది రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు బలవుతున్నారు. తాజాగా మరో రాజకీయ నాయకుడు కరోనా కాటుకు బలి అయ్యాడు. ఉత్తరప్రదేశ్ రెవెన్యూ, వరద నియంత్రణ మంత్రి విజయ్ కశ్యప్(56) కరోనాతో మృతి చెందారు. ఆయనకు గత కొన్ని రోజుల క్రితం కరోనా పాజివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన అత్యవసర చికిత్స నిమిత్తం గురుగావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. తన ఆరోగ్యపరిస్థితి క్షీణిచడంతో ఆసుపత్రిలోనే మంగళవారం తుది శ్వాస విడిచారు. కశ్యప్ ప్రస్తుతం మజఫర్ నగర్‌లోని చార్తవాల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కశ్యప్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. విజయ్ కశ్యప్‌తో కలిపి యూపీలో ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులు కరోనాతో కన్నుమూశారు.