వలస కార్మికుల విషయమై యాక్షన్ ప్లాన్ రెడీ చేయండి : యోగి
లక్నో: వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించేందుకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తిరిగి స్వరాష్ట్రానికి రప్పించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు గాను క్వారంటైన్లను, శిబిరాలను, కమ్యూనిటీ చికెన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూపీ వాసులు ఓపికతో మసులు కోవాలని, స్వస్థలాలకు కాలినడకతో రావడం చేయరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. దాదాపు […]
లక్నో: వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించేందుకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తిరిగి స్వరాష్ట్రానికి రప్పించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు గాను క్వారంటైన్లను, శిబిరాలను, కమ్యూనిటీ చికెన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూపీ వాసులు ఓపికతో మసులు కోవాలని, స్వస్థలాలకు కాలినడకతో రావడం చేయరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. దాదాపు 6 లక్షల మంది వలస కార్మికులు తిరిగి యూపీకి చేరుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Tags: migrant workers, up cm yogi, centre approval, covid 19 , lock down