కూకట్‌పల్లిలో యూపీ సీఎం రోడ్ షో..

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ నుంచి పార్టీ అగ్రనేతలను దింపుతుంది. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్ శనివారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి వద్ద భారీ రోడ్ షో నిర్వహించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, నేతలు భారీగా రోడ్ షోలో పాల్గొన్నారు. కాగా ఇదే రోజు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఉండటంతో […]

Update: 2020-11-28 05:44 GMT
UP CM Yogi Adityanath
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ నుంచి పార్టీ అగ్రనేతలను దింపుతుంది. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్ శనివారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి వద్ద భారీ రోడ్ షో నిర్వహించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, నేతలు భారీగా రోడ్ షోలో పాల్గొన్నారు. కాగా ఇదే రోజు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఉండటంతో హైదరాబాద్‌లో ఆసక్తికర వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News