పటాల రూపంలో పాఠాలు.. ఆ ప్రొఫెసర్ ప్రతిభకు నెటిజన్లు ఫిదా

దిశ, ఫీచర్స్: జనరల్ సైన్స్‌లో జీవ‌శాస్త్రం చదివేటపుడు ప్రతి విద్యార్థి అటెంప్ట్ చేసే ఏకైక ప్రశ్న ‘పటాలు-ప్రయోగాలు’. ఒక ప్రశ్న మొక్కల గురించి అడిగితే మరోకటి జంతువుల గురించి అడుగుతారు. అయితే ఈ బిట్‌ను 5 మార్కుల ప్రశ్నగానే అందరూ భావిస్తారు. కానీ, ఆ పటంలోని పూర్తిసారాశం మనకెంతో జ్ఞానాన్ని అందిస్తుంది. థియరీ అంశాలను కూడా పటాల రూపంలో చదివితే ఎప్పటికీ మరిచిపోరని ఉపాధ్యాయులు ఎప్పుడూ చెబుతుంటారు. ఈ క్రమంలో ఓ ప్రొఫెసర్ పాఠాలను డ్రాయింగ్ రూపంలో […]

Update: 2021-08-20 07:05 GMT

దిశ, ఫీచర్స్: జనరల్ సైన్స్‌లో జీవ‌శాస్త్రం చదివేటపుడు ప్రతి విద్యార్థి అటెంప్ట్ చేసే ఏకైక ప్రశ్న ‘పటాలు-ప్రయోగాలు’. ఒక ప్రశ్న మొక్కల గురించి అడిగితే మరోకటి జంతువుల గురించి అడుగుతారు. అయితే ఈ బిట్‌ను 5 మార్కుల ప్రశ్నగానే అందరూ భావిస్తారు. కానీ, ఆ పటంలోని పూర్తిసారాశం మనకెంతో జ్ఞానాన్ని అందిస్తుంది. థియరీ అంశాలను కూడా పటాల రూపంలో చదివితే ఎప్పటికీ మరిచిపోరని ఉపాధ్యాయులు ఎప్పుడూ చెబుతుంటారు. ఈ క్రమంలో ఓ ప్రొఫెసర్ పాఠాలను డ్రాయింగ్ రూపంలో వివరిస్తూ ఇంటర్నెట్ అటెన్షన్‌ డ్రా చేశాడు. అతడు బోర్డు మీద వేసే బొమ్మలు చూస్తే పుస్తకంలో కూడా అంత బాగా ప్రింట్ కాదేమో అని సందేహం వస్తుంది. మరి ఆ ప్రొఫెసర్ ఎవరు? అతని ఆర్ట్ నైపుణ్యమేమిటో తెలుసుకుందాం.

తైవాన్‌లోని ‘షుడె యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో యువ ఉపాధ్యాయుడు జాంగ్ క్వాన్‌బిన్.. అద్భుతమైన బ్లాక్‌బోర్డ్ డ్రాయింగ్‌లతో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు. రంగురంగుల చాక్‌పీస్‌లతో బ్లాక్‌బొర్డుపై గీసే శరీర నిర్మాణ పటాలు చూస్తే మళ్లీ విద్యార్థులు పుస్తకం తెరిచి ఆ పాఠం చదువుకోనవసరం లేదు. మానవ ఎముక నిర్మాణ వివరణాత్మక వర్ణనల నుంచి మానవ శరీరానికి సంబంధించి అన్ని కోణాల్లో వివరిస్తాడు. ఎముకలు, కండరాలు, అంతర్గత అవయవాల స్థానాలను ఎలా పునర్నిర్మించాలనేది పాఠం రూపంలో కాకుండా పటాల ద్వారానే వివరిస్తాడు. క్వాన్‌బిన్‌కు మానవ శరీర నిర్మాణ శాస్త్రంపై మంచి అవగాహన ఉండగా, డ్రాయింగ్‌లో సహజమైన ప్రతిభ ఉంది. అయితే అతడి వివరణాత్మక కళాకృతులు మానవ శరీరంపై దృష్టి సారించినప్పటికీ క్వాన్‌బిన్ హ్యుమన్ అనాటమీ బోధించడు. విజువల్ కమ్యూనికేషన్ డిజైన్ విభాగంలో అనాటమీ ఇలస్ట్రేషన్స్ అండ్ డ్రాయింగ్ స్కిల్స్ బోధిస్తాడు. తైవాన్, చైనా, జపాన్‌లో అనేక మెడికల్ స్కూల్స్ ద్వారా తమ విద్యార్థులకు ఎలా డ్రాయింగ్స్ వేయాలో శిక్షణ అందించాడు.

‘మాకు పాఠ్యపుస్తకాలున్నా వాటిని చదవం. ఆయా అంశాలను బొమ్మల రూపంలో గీస్తాం. ఓ మ్యాప్ గీస్తున్నప్పుడే సగం పాఠం నేర్చుకుంటాం’ అని విద్యార్థులు అంటున్నారు. జాంగ్ క్వాన్‌బిన్ తన బ్లాక్‌బోర్డ్ కళాఖండాల ఫోటోలు, వీడియోలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుంటాడు.

Tags:    

Similar News