తాట తీయడం నాకు తెలుసు: కేంద్ర మంత్రి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లోని ఓ క్వారంటైన్ సెంటర్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులపైకి కేంద్ర మంత్రి రేణుకా సింగ్ ఫైర్ అయ్యారు. రూమ్‌లోకి తీసుకెళ్లి బెల్టుతో తాట తీయడం తనకు బాగా తెలుసునని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలోని బలరాంపూర్‌లోని ఓ క్వారంటైన్ సెంటర్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులపై కేంద్ర గిరిజనుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ విరుచుకుపడ్డారు. ‘మీ దాదాగిరీ ఇక్కడ నడువది. […]
రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లోని ఓ క్వారంటైన్ సెంటర్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులపైకి కేంద్ర మంత్రి రేణుకా సింగ్ ఫైర్ అయ్యారు. రూమ్‌లోకి తీసుకెళ్లి బెల్టుతో తాట తీయడం తనకు బాగా తెలుసునని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలోని బలరాంపూర్‌లోని ఓ క్వారంటైన్ సెంటర్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులపై కేంద్ర గిరిజనుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ విరుచుకుపడ్డారు. ‘మీ దాదాగిరీ ఇక్కడ నడువది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదనుకుంటున్నారా? 15 ఏళ్లు ఇక్కడ అధికారంలో ఉన్నాం. పేదలకు నిధులు అందించే సత్తా నాకు ఉన్నది. బీజేపీ కార్యకర్తలు బలహీనులని భావించొద్దు. రూమ్‌లోకి తీసుకెళ్లి బెల్టుతో బాదడం నాకు బాగా తెలుసున’ని హెచ్చరించారు. ఢిల్లీ నుంచి ఛత్తీస్‌గడ్‌కు వచ్చి బలరాంపూర్‌లోని క్వారంటైన్‌లో ఉన్న దిలీప్ గుప్తా.. అక్కడ వసతులు సరిగా లేవని ఆరోపణలు చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.