వాళ్లు ఇంట్లో ఈటల ఫొటో పెట్టుకోవాలి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

దిశ, కమలాపూర్: ‘దళితబంధు’ పొందినవాళ్లు ఇంట్లో బీజేపీ హుజురాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫొటో పెట్టుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. శనివారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల, గూడూరు, కానిపర్తి, శంభునిపల్లి, దేశరాజుపల్లి గ్రామాల్లో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుటుంబ పాలన ఉండాలా? పోవాలో తేల్చేది హుజురాబాద్ ప్రజలే అని అన్నారు. ఆత్మ బలిదానాలు, త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. కానీ, తెలంగాణ కాకుండా, […]

Update: 2021-10-23 10:17 GMT
Union Minister Kishan Reddy
  • whatsapp icon

దిశ, కమలాపూర్: ‘దళితబంధు’ పొందినవాళ్లు ఇంట్లో బీజేపీ హుజురాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫొటో పెట్టుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. శనివారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల, గూడూరు, కానిపర్తి, శంభునిపల్లి, దేశరాజుపల్లి గ్రామాల్లో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుటుంబ పాలన ఉండాలా? పోవాలో తేల్చేది హుజురాబాద్ ప్రజలే అని అన్నారు. ఆత్మ బలిదానాలు, త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. కానీ, తెలంగాణ కాకుండా, కేసీఆర్ బంగారు కుటుంబం అయిందని అన్నారు. రాష్ట్రంలో నిజాం, నియంత, నిర్బంధ, ప్రజావ్యతిరేక పాలన నడుస్తోందని అన్నారు. హుజురాబాద్‌లో దద్దమ్మలను కాకుండా, ధైర్యంగా ప్రజల పక్షాన ప్రశ్నించే ప్రజా గొంతుక ఈటలను అసెంబ్లీకి పంపించాలని కోరారు.

బీజేపీ పార్టీ మీటింగ్‌లకు ప్రజలను రానియ్యకుండా టీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యం చేస్తూ అడ్డుకుంటున్నారని ఆగ్రహించారు. నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ ర్యాలీని అడ్డుకున్నారని, తాను విద్యార్థి దశనుండే పోరాటం చేశానని, తండ్రిని అడ్డుపెట్టుకుని రాజకీయాలకు రాలేదని అన్నారు. బీజేపీ నాయకులు పోరాటాల నుంచే రాజకీయాల్లోకి వచ్చారని, ఎవరి తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని హెచ్చరించారు. గూడూరు ప్రచారంలో పాల్గొన్న జనాన్ని చూసి జనాన్ని చూసి కేసీఆర్ హుజురాబాద్ నుంచి ఉపసంహరించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నాయకులు బీజేపీకి ఓటు వేస్తే పింఛన్లు, రైతుబంధు, దళితబంధు, రాష్ట్ర సంక్షేమ పథకాలు ఇవ్వబోమని ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఈటలకు చేసిన అవమానం ఈటలకు ఒక్కడికే కాదని తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జరిగినట్లుగా భావించాలన్నారు. దళితబంధు ఈటల వల్లే వచ్చిందని, దళిత బంధు పొందిన వాళ్లందరూ ఇంట్లో ఈటల ఫోటో పెట్టుకోవాలన్నారు.

Tags:    

Similar News