అన్‌లాక్ 3.O సిద్ధమవుతోంది

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌లో తొలుత లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రజా అవసరాలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ఆంక్షలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్‌ చేస్తూ వస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం గతంలో విధించిన ఆన్ లాక్ 2.O జులై 31తో ముగియనుంది. దీంతో ఆన్‌లాక్ 3.Oపై కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. అన్‌లాక్ 2.O జులై 31 ముగిస్తున్నందున.. యథావిథిగా ఆగస్టు 1 నుంచి అన్‌లాక్ […]

Update: 2020-07-26 09:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌లో తొలుత లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రజా అవసరాలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ఆంక్షలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్‌ చేస్తూ వస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం గతంలో విధించిన ఆన్ లాక్ 2.O జులై 31తో ముగియనుంది. దీంతో ఆన్‌లాక్ 3.Oపై కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది.

అన్‌లాక్ 2.O జులై 31 ముగిస్తున్నందున.. యథావిథిగా ఆగస్టు 1 నుంచి అన్‌లాక్ 3.O ప్రారంభం కానుంది. అయితే, ఇందులో ముఖ్యంగా గత నాలుగు నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్లను ఓపెన్ చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కేవలం 25 శాతం మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు సమాచారం.

కొవిడ్-19 నిబంధనలతో జిమ్‌లు కూడా తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఇక విద్యాసంస్థలు, మెట్రో సేవలపై మాత్రం కేంద్రం అనుమతి ఇవ్వడానికి సుముఖంగా లేదు. దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పలువురు అన్‌లాక్‌ను ఖండిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో కరోనా కట్టడి అయిందని.. అన్‌లాక్ అమలు చేయడంతో కేసులు పెరుగుతున్నాయిని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లాక్‌3.O అమలులోకి వస్తే వైరస్ తీవ్రత పెరుగుతోందని.. ఇక జాగ్రత వహించాల్సింది ప్రజలేనంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News