అన్‌లాక్-6 నిబంధనలు విడుదల

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో తాజాగా కేంద్ర హోంశాఖ అన్‌లాక్-6 నిబంధనలను విడుదల చేసింది. అన్‌లాక్ -5లో విడుదల చేసిన నిబంధనలు ఏమైతే ఉన్నాయో అవే నిబంధనలు నవంబర్ నెల ముగింపు వరకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 30న రిలీజ్ చేసిన నిబంధనలు వచ్చే నెలలో కూడా వర్తించనున్నాయి. అన్‌లాక్‌‌ భాగంగా కేంద్ర ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతాయన్న కేంద్ర హోంశాఖ.. తగు జాగ్రత్తలు కూడా […]

Update: 2020-10-27 09:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో తాజాగా కేంద్ర హోంశాఖ అన్‌లాక్-6 నిబంధనలను విడుదల చేసింది. అన్‌లాక్ -5లో విడుదల చేసిన నిబంధనలు ఏమైతే ఉన్నాయో అవే నిబంధనలు నవంబర్ నెల ముగింపు వరకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 30న రిలీజ్ చేసిన నిబంధనలు వచ్చే నెలలో కూడా వర్తించనున్నాయి.
అన్‌లాక్‌‌ భాగంగా కేంద్ర ప్రభుత్వం

కంటైన్‌మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతాయన్న కేంద్ర హోంశాఖ.. తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచనలు చేసింది. కంటైన్‌మెంట్ లేని ప్రాంతాల్లో అన్ని రకాల కార్యకలాపాలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి లాక్‌డౌన్ విధించకూడదని స్పష్టం చేసింది. సామాజిక, క్రీడా, విద్యా, వినోద, సాంస్కృతిక, రాజకీయ సమావేశాలను 200 మంది హాజరుకావచ్చు. ఇదే సమయంలో మాస్క్‌లు, శానిటైజర్, భౌతికదూరం తప్పనిసరి చేసింది. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని గుర్తు చేసింది. ఇక సినిమా హాళ్లలో 50 శాతం ప్రేక్షకులకు ఇదివరకే అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌-6లో కూడా కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పస్టం చేసింది.

Tags:    

Similar News