డబ్ల్యూహెచ్‌వో సైట్‌లో తప్పుగా భారత చిత్రం
న్యూఢిల్లీ: భారత రాజకీయ చిత్రపటాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెబ్‌సైట్ తప్పుగా చిత్రిస్తున్నదని లేవనెత్తిన సందేహాలపై కేంద్రం స్పందించింది. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో అధికారుల ముందు లేవనెత్తామని, తీవ్రంగా ఖండించామని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో వివరించారు. దీనిపై సంస్థ జెనీవాలోని భారత దౌత్యాధికారులతో చర్చించిందని, తాము చిత్రంలో చూపించిన దేశ సరిహద్దులు చట్టబద్ధమైనవి కావని వివరించిందని తెలిపారు.