హైదరాబాద్ లో హిందీ పరిమళం
దిశ, కంటోన్మెంట్: హైదరాబాద్ లో హిందీ పరిమళాలను వెదజల్లేందుకు హిందీ సంస్థాన్ భవన్ కృషి చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ నిషాంక్ అన్నారు. బోయిన్ పల్లిలో హైదరాబాద్ కేంద్ర హిందీ సంస్థాన్ నూతన భవనాన్ని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 1960 నుంచి హిందీ భాషాభివృద్ధికి సంస్థాన్ చేసిన సేవలను కొనియాడారు. ఔత్సహిక హిందీ ఉపాధ్యాయులకు ప్రత్యేక కోర్సులలో శిక్షణను ఇస్తూ.. సుశిక్షితులుగా […]
దిశ, కంటోన్మెంట్:
హైదరాబాద్ లో హిందీ పరిమళాలను వెదజల్లేందుకు హిందీ సంస్థాన్ భవన్ కృషి చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ నిషాంక్ అన్నారు. బోయిన్ పల్లిలో హైదరాబాద్ కేంద్ర హిందీ సంస్థాన్ నూతన భవనాన్ని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 1960 నుంచి హిందీ భాషాభివృద్ధికి సంస్థాన్ చేసిన సేవలను కొనియాడారు. ఔత్సహిక హిందీ ఉపాధ్యాయులకు ప్రత్యేక కోర్సులలో శిక్షణను ఇస్తూ.. సుశిక్షితులుగా తీర్చిదిద్దుతోందన్నారు. ఆగ్రా ప్రధాన కేంద్రంగా హిందీయేతర ప్రాంతాల విద్యార్థులకు స్కాలర్ షిప్ అధారిత శిక్షణ ను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో ఎంపికైన విద్యార్థులు ఇండియన్ కల్చర్ తోపాటు హిందీ పట్ల తమ నాలెడ్జ్ ను ద్విగుణీకృతం చేసుకోనున్నట్లు తెలిపారు. ఇలా దేశంలో 8 కేంద్రాలు పనిచేస్తున్నాయని, హిందీ భాషను దినాదినాభివృద్ది చేసేందుకు ఈ కేంద్రాలు దోహదపడుతాయని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. 1976నుంచి హైదరాబాద్ కేంద్రంగా హిందీ సంస్థాన్ పనిచేయడం, ఎంతో మందిని హిందీ భాషా ప్రావీణులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు.