రామప్ప గుర్తింపుతో చరిత్రకారుల్లో పెరిగిన ఉత్సాహం
దిశ,తెలంగాణ బ్యూరో : ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో రాష్ట్రంలోని రాయప్ప ఆలయాన్ని గుర్తించడంతో దేశ విదేశాల నుంచి పర్యాటకులు క్యూ కట్టనున్నారు. దీంతో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే విధంగా వచ్చిన గుర్తింపుతో రాష్ట్రం నుంచి నామినేట్ చేసిన మిగతా కట్టడాలకూ గుర్తింపు వస్తుందని చరిత్రకారుల్లో ఉత్సాహం కలిగించింది. కాగా రాష్ట్రం నుంచి చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌షాహి సమాధులను యునెస్కో గుర్తింపుకోసం నామినేట్ చేశారు. తెలంగాణ ఏర్పడిననాటి నుంచి వారసత్వ కట్టడాల జాబితాలో చోటు కోసం […]
దిశ,తెలంగాణ బ్యూరో : ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో రాష్ట్రంలోని రాయప్ప ఆలయాన్ని గుర్తించడంతో దేశ విదేశాల నుంచి పర్యాటకులు క్యూ కట్టనున్నారు. దీంతో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే విధంగా వచ్చిన గుర్తింపుతో రాష్ట్రం నుంచి నామినేట్ చేసిన మిగతా కట్టడాలకూ గుర్తింపు వస్తుందని చరిత్రకారుల్లో ఉత్సాహం కలిగించింది. కాగా రాష్ట్రం నుంచి చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌షాహి సమాధులను యునెస్కో గుర్తింపుకోసం నామినేట్ చేశారు.
తెలంగాణ ఏర్పడిననాటి నుంచి వారసత్వ కట్టడాల జాబితాలో చోటు కోసం 400 ఏళ్ల నాటి పురాతన నగరమైన హైదరాబాద్ పోటీ పడుతూనే ఉంది. కానీ ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు గుర్తింపు పొందడంలో విఫలమవుతున్నాయి. రాష్ట్రంలోని చరిత్రకారులు, హరిటేజ్ ప్రేమికులు నగరానికి వారసత్వ గుర్తింపు పొందేలా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని, దానికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా పట్టింపు లేకుండా పోయింది.
దశాబ్దం క్రితమే చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహి సమాధి సముదాయాన్ని యునెస్కో గుర్తింపు కోసం ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ గుర్తింపు పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం పట్టించుకోలేకపోలేదు. యునెస్కో గుర్తిస్తే పరిసర ప్రాంతాలు అభివృద్ధి పొంది ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తాయి. కానీ దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రభుత్వాలు ప్రశ్నించాల్సికోవాల్సిన అంశం.
చరిత్రను కాపాడి అభివృద్ధి చేస్తేనే గుర్తింపు
రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో గుర్తించదగ్గ ప్రదేశాలు, కట్టడాలు ఉన్నాయి. నగరంలోని చార్మినార్, గోల్కొండ లాంటి ప్రాంతాలు ఎంతో పురాతనమైనవి. వీటిని యునెస్కో గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటే వారసత్వ కట్టడ జాబితాలో గుర్తించే అవకాశం ఉంది. కానీ యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపి చేతులు దులుపేసుకుంటే గుర్తింపు అసాధ్యం. యునెస్కో నామ్స్ కి సరితూగే విధంగా కట్టడాలను, పరిసరాలను సమకూర్చినప్పుడే ప్రపంచ దేశాలు ఆమోదం తెలుపుతాయి. కానీ ఆ దిశగా చర్యలు మొదలుపెట్టలేదు. కట్టడ చరిత్రను కాపాడుతూ కట్టడ నిజస్వరూపాన్ని తెలియజేసేలా చర్యలు తీసుకోవాలి. కట్టడ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి కబ్జాలు జరగకుండా నిషేధిత ప్రాంతంగా గుర్తించాలి. చరిత్రను కాపాడటం మానేసి వాటిని కూల్చేసి బిల్డింగ్‌లు కట్టడం లాంటివి చరిత్రను దెబ్బతీసే పనులు. ఇవి యునెస్కో గుర్తింపు రాకుండా చేస్తున్నాయి. ముందుగా చరిత్రను కాపాడి అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తోందని యునెస్కో నమ్మితే గుర్తింపు రావడం తథ్యం.
– అనురాధ రెడ్డి, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాచ్)
కన్వీనర్