విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన.. డీటీడీఓపై చర్యలు తీసుకోవాలి

దిశ, తాండూర్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గిరిజన పాఠశాల విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి(డీటీడీఓ) జనార్దన్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ నిరుద్యోగ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం మత్తులో పాఠశాలకు వెళ్లి విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, చంపుతానని బెదిరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినిల బాగోగులు చూడాల్సిన డీటీడీఓ మద్యం […]

Update: 2021-11-15 05:33 GMT
విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన.. డీటీడీఓపై చర్యలు తీసుకోవాలి
  • whatsapp icon

దిశ, తాండూర్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గిరిజన పాఠశాల విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి(డీటీడీఓ) జనార్దన్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ నిరుద్యోగ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం మత్తులో పాఠశాలకు వెళ్లి విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, చంపుతానని బెదిరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినిల బాగోగులు చూడాల్సిన డీటీడీఓ మద్యం తాగి విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, మనోవేదనకు గురి చేయడం దారుణమన్నారు. విద్యాలయాల్లో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం, జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Tags:    

Similar News