అసెంబ్లీ ముట్టడికి యత్నం… మోహరించిన పోలీసులు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీపీఐ, బీజేపీ, నిరుద్యోగ సంఘాల నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… ఉద్యోగాల భర్తీ కోసం అసెంబ్లీ ముట్టడి చేశారు. గమనించిన పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ దగ్గర భారీగా పోలీసు బలగాలను […]

Update: 2020-10-13 03:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీపీఐ, బీజేపీ, నిరుద్యోగ సంఘాల నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… ఉద్యోగాల భర్తీ కోసం అసెంబ్లీ ముట్టడి చేశారు. గమనించిన పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అంతేగాకుండా ఇవాళ ప్రవేశ పెట్టిన జీహెంచ్ఎంసీ సవరణ బిల్లులను కూడా వ్యతిరేకిస్తూ.. పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు.

Tags:    

Similar News