రాలిన ఆకుల నుంచి పేపర్

దిశ, వెబ్‌డెస్క్: ఈ భూమ్మీద ప్రతీ వస్తువును రీయూజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, మనమే ఆ దిశగా ఆలోచించం, కనీసం పరిశీలన కూడా చేయం. ఇప్పటికే వాడాం కదా.. ఇంకేం చేయగలం అని సరిపెట్టుకుంటాం. కానీ కొందరు మాత్రం రీయూజబిలిటీని సీరియస్‌గా తీసుకుంటున్నారు. చెత్తను కూడా తిరిగి ఉపయోగించే విధానాలను ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి. దానిపై రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ దేశానికి చెందిన స్టూడెంట్ చేసిన సైన్స్ ఓ ప్రాజెక్ట్ అందరినీ […]

Update: 2020-12-17 05:49 GMT
రాలిన ఆకుల నుంచి పేపర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఈ భూమ్మీద ప్రతీ వస్తువును రీయూజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, మనమే ఆ దిశగా ఆలోచించం, కనీసం పరిశీలన కూడా చేయం. ఇప్పటికే వాడాం కదా.. ఇంకేం చేయగలం అని సరిపెట్టుకుంటాం. కానీ కొందరు మాత్రం రీయూజబిలిటీని సీరియస్‌గా తీసుకుంటున్నారు. చెత్తను కూడా తిరిగి ఉపయోగించే విధానాలను ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి. దానిపై రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ దేశానికి చెందిన స్టూడెంట్ చేసిన సైన్స్ ఓ ప్రాజెక్ట్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. అతడు రాలిన ఆకులు, పీచు నుంచి పేపర్ తయారు చేస్తూ భేష్ అనిపించుకుంటున్నాడు. ఇందు కోసం ఆ కుర్రాడు ఎన్ని రోజులు కష్టపడ్డాడు? ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఏ దశలో ఉందో తెలుసుకుందాం.

ఉక్రెయిన్ దేశంలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన వాలెంటైన్ ఫ్రెచ్క అనే హై స్కూల్ స్టూడెంట్‌కు సైన్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని క్లాస్ రూమ్ పాఠాల ద్వారా తెలుసుకున్న తను.. దాన్ని ఆచరణలో చేసి చూపాలనుకున్నాడు. చెట్ల నుంచి రాలిన ఆకుల ద్వారా పేపర్లు తయారు చేయాలనే అంశాన్ని తన సైన్సు ప్రాజెక్టుగా ఎంచుకున్నాడు. దీనికి ‘రీ-లీఫ్ పేపర్’ అని నామకరణం చేసిన ఆ విద్యార్థి.. ఇందుకోసం మూడేళ్ల నుంచి కష్టపడుతున్నాడు. చెట్ల నుంచి రాలిన ఆకులు, పీచుతో(మృత ఆకుల నుంచి సేకరించిన) పేపర్ ఒక్కటి మాత్రమే కాకుండా పేపర్ బ్యాగులు, ప్యాకేజింగ్ మెటీరియల్ కూడా ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రాజెక్టును మొదట ఎక్కడ ప్రారంభించాడంటే..

ఉక్రెయిన్ దేశ రాజధాని క్యివ్‌కు పశ్చిమ భాగాన 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైటోమర్ నగరంలో ఒక కప్‌బోర్డ్ మ్యానుఫాక్చరర్‌తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుని తన పనులు ప్రారంభించాడు. పేపర్ ఉత్పత్తుల వల్ల పర్యావరణానికి జరిగే హానిని నిరోధించడంతో పాటు ఎకో ఫ్రెండ్లీగా ఆకుల నుంచి పేపర్ ఉత్పత్తి చేయడమే లక్ష్యమని తెలిపాడు. చాలా పార్కుల్లో రాలిన ఆకులను వేస్ట్‌గా భావించి తీసి చెత్తుకుప్పల్లో వేస్తారు. కానీ వాటిని రీయూజ్ చేయడం ద్వారా పర్యావరణ హితమైన ప్యాకేజింగ్‌లో ఉపయోగించుకోవచ్చనేది తన ఐడీయా అని ఫ్రెచ్క వివరించాడు. క్యివ్‌తో పాటు ఇతర నగరాల నుంచి సేకరించిన ఆకుల ద్వారా తొలి బ్యాచ్ సాలిడ్ (ఘన పదార్థంలో ఉన్న) ఈ పేపర్లను ‘రీ-లీఫ్ పేపర్’ నుంచి అక్టోబర్‌లో ఉత్పత్తి చేశారు. ఇక ఇప్పుడు వాణిజ్య పరంగా అన్ని నగరాలకు రీచ్ అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News