ఆక్స్ఫర్డ్ టీకాకు యూకే ఆమోదం
దిశ, వెబ్డెస్క్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాను బుధవారం యూకే ప్రభుత్వం ఆమోదించింది. జనవరి 4నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగంలోకి రానుందని యూకే ఔషద నియంత్రణ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఫైజర్ టీకాను ఆమోదించిన యూకే, ఇప్పుడు ఆక్స్ఫర్డ్ టీకాకు ఓకే చెప్పింది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా టీకాను ఆమోదించిన తొలిదేశం యూకే కాగా.. ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన మూడో కరోనా వ్యాక్సిన్ ఇదే. కొత్త రకం కరోనా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన బ్రిటన్.. […]
దిశ, వెబ్డెస్క్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాను బుధవారం యూకే ప్రభుత్వం ఆమోదించింది. జనవరి 4నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగంలోకి రానుందని యూకే ఔషద నియంత్రణ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఫైజర్ టీకాను ఆమోదించిన యూకే, ఇప్పుడు ఆక్స్ఫర్డ్ టీకాకు ఓకే చెప్పింది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా టీకాను ఆమోదించిన తొలిదేశం యూకే కాగా.. ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన మూడో కరోనా వ్యాక్సిన్ ఇదే. కొత్త రకం కరోనా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన బ్రిటన్.. అత్యవసరంగా ఆక్స్ఫర్డ్ టీకాను అందుబాటులోకి తెచ్చి, 100 మిలియన్ ఆస్ట్రాజెనెకా డోసులను ఆర్డర్ చేసింది. సోమవారం ఒక్కరోజే యూకేలో 20వేలకు పైగా కరోనా స్ట్రెయిన్ కేసులు వచ్చాయి.