సీఐఐ నూతన అధ్యక్షుడిగా ఉదయ్ కోటక్

దిశ, సెంట్రల్ డెస్క్: 2020-2021 సంవత్సరానికి భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నూతన అధ్యక్షుడిగా కోటక్ బ్యాంక్ సీఈవో, ఎండీ ఉదయ్ కోటక్‌ను నియమిస్తున్నట్టు బుధవారం ఛాంబర్ వెల్లడించింది. గత రెండేళ్లుగా సీఐఐ అధ్యక్షుడిగా ఉన్న కిర్లోస్కర్ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్, ఎండీ విక్రమ్ కిర్లోస్కర్ విధులు నిర్వర్తించారు. ప్రెసిడెంట్ డిసిగ్నేట్ స్థానంలో టాటా స్టీల్ లిమిటెడ్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్, వైస్ ప్రెసిడెంట్‌గా బజాజ్ ఫిన్‌సర్వ్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ కొనసాగుతారు. ఇదివరకూ ప్రెసిడెంట్ […]

Update: 2020-06-03 07:27 GMT

దిశ, సెంట్రల్ డెస్క్: 2020-2021 సంవత్సరానికి భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నూతన అధ్యక్షుడిగా కోటక్ బ్యాంక్ సీఈవో, ఎండీ ఉదయ్ కోటక్‌ను నియమిస్తున్నట్టు బుధవారం ఛాంబర్ వెల్లడించింది. గత రెండేళ్లుగా సీఐఐ అధ్యక్షుడిగా ఉన్న కిర్లోస్కర్ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్, ఎండీ విక్రమ్ కిర్లోస్కర్ విధులు నిర్వర్తించారు. ప్రెసిడెంట్ డిసిగ్నేట్ స్థానంలో టాటా స్టీల్ లిమిటెడ్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్, వైస్ ప్రెసిడెంట్‌గా బజాజ్ ఫిన్‌సర్వ్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ కొనసాగుతారు. ఇదివరకూ ప్రెసిడెంట్ డిసిగ్నేట్‌గా ఉదయ్ కోటక్ చేశారు. టీవీ నరేంద్రన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు చెందిన మైనింగ్, మెటల్స్ కౌన్సిల్ కో-ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు. సంజీవ్ బజాజ్ సీఐఐ వెస్ట్ విభాగానికి ఛైర్మన్‌గా సేవలందించారు. సీఐఐ నూతన అధ్యక్షుడు ఉదయ్ కోటక్ సెబీ ఏర్పాటు చేసిన కార్పొరేట్ గవర్నెన్స్ కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 2017, అక్టోబర్‌లో ఉదయ్ నేతృత్వంలోని ప్యానెల్ దృఢమైన, పారదర్శక పాలనను అందించేందుకు భారీ మార్పులతో కార్పొరేట్ పాలనపై సెబీకి నివేదిక సమర్పించారు. ఉదయ్ కోటక్ ముంబై విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, ముంబైలోని జమ్నాలాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ స్టడీస్ డిగ్రీని తీసుకున్నారు.

ఉదయ్ కోటక్ అందుకున్న అవార్డులు:

* ఉదయ్ కోటక్ 2014 లో ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ అందుకున్నారు.
* 2015 లో ‘ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’,
* 2016లో బిజినెస్ ఇండియా వారినుంచి ‘బిజినెస్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్’,
* 2016లో ‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ ఉత్తమ బ్యాంకు అవార్డు,
* యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన 2018-ఇండియా ఐడియాస్ సమ్మిట్‌లో ‘ యూఎస్ఐబీసీ ​​గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు’,
* 2019 లో బిజినెస్‌వరల్డ్ నుంచి మాగ్నా అవార్డ్స్ ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’
* 2019లో బిజినెస్ వరల్డ్ ‘బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉత్తమ సీఈఓ అవార్డు’

Tags:    

Similar News