రైల్వే గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట వద్ద విషాదం చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం గుట్ట వద్ద ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పక్కన ఉన్న విద్యుత్ స్తంభం కూలి, కరెంటు తీగలు కూలీలపై పడ్డాయి. అదే సమయంలో రైల్వే ట్రాక్‌ను ఆనుకొని ఉన్న గోడకూలింది. దీంతో కూలీలు కిషోర్(40), బాధల్(24) శితిలాల కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కూలీలంతా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా […]

Update: 2021-05-10 02:57 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట వద్ద విషాదం చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం గుట్ట వద్ద ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పక్కన ఉన్న విద్యుత్ స్తంభం కూలి, కరెంటు తీగలు కూలీలపై పడ్డాయి. అదే సమయంలో రైల్వే ట్రాక్‌ను ఆనుకొని ఉన్న గోడకూలింది. దీంతో కూలీలు కిషోర్(40), బాధల్(24) శితిలాల కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కూలీలంతా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బీరుర్ స్టేషన్‌కు చెందిన వారీగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను వెలికి తీసే పనిలో పడ్డారు. ఫైర్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. కాంట్రాక్టర్ ముందుగానే విద్యుత్ లైన్‌లు తీయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం మూలంగానే వారు మృతిచెందారని స్థానికులు ఆరోపించారు.

Tags:    

Similar News