దళిత బంధు మీటింగ్.. మరో ప్రాణం తీసింది
దిశ, హుజురాబాద్/హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ఉప ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. హుజురాబాద్ బై ఎలక్షన్‌లో అక్టోబర్ 26న టీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి శాలపల్లి నుంచి ఆటో ట్రాలీలో 21 మందిని తరలించారు. ఆటో ట్రాలీలో ఈ సమావేశానికి వస్తుండగా హుజురాబాద్ మండలం రాజపల్లి శివారు వద్ద లారీ ఢీకొనడంతో 16 మంది తీవ్రంగా […]
దిశ, హుజురాబాద్/హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ఉప ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. హుజురాబాద్ బై ఎలక్షన్‌లో అక్టోబర్ 26న టీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి శాలపల్లి నుంచి ఆటో ట్రాలీలో 21 మందిని తరలించారు. ఆటో ట్రాలీలో ఈ సమావేశానికి వస్తుండగా హుజురాబాద్ మండలం రాజపల్లి శివారు వద్ద లారీ ఢీకొనడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారందరినీ ఆస్పత్రికి తరలించారు. హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 28న నెల్లి స్వరూప మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలతో సీరియస్‌గా ఉన్న వంతడుపుల రాజేశ్వరి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచింది.
మృతదేహంతో ధర్నా
రాజేశ్వరి మృతదేహంతో ఆమె కుటుంబ సభ్యులు, ఆ రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులు సోమవారం పట్టణంలోని సూపర్ బజార్‌లో ధర్నా చేపట్టారు. సంబంధిత నాయకులెవరూ తమకు ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదని వారంతా ఆందోళనకు దిగారు. మృతి చెందిన కుటుంబాలతో పాటు గాయపడిన వారందరికీ న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని బాధితులు తెలిపారు.