కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. గురువారం రాత్రి మొదలైన ఈ ఎన్‌కౌంటర్ శుక్రవారం ఉదయం వరకూ కొనసాగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికారులు తెలిపారు. దక్షిణ కశ్మీర్ జిల్లా పుల్వామాలోని త్రాల్ ఏరియాలో కొందరు ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో స్టేట్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపడుతుండగా గురువారం రాత్రి కాల్పులు, ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. […]
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. గురువారం రాత్రి మొదలైన ఈ ఎన్‌కౌంటర్ శుక్రవారం ఉదయం వరకూ కొనసాగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికారులు తెలిపారు. దక్షిణ కశ్మీర్ జిల్లా పుల్వామాలోని త్రాల్ ఏరియాలో కొందరు ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో స్టేట్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపడుతుండగా గురువారం రాత్రి కాల్పులు, ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. రాత్రి ఆపరేషన్‌ను విరమించి ఉగ్రవాదులు చీకటిలో పారిపోకుండా కాపు కాశారు. తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
అనంత్‌నాగ్‌లో జవాన్ సహా బాలుడు మృతి
జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు ఒక్క ఉదుటన సీఆర్‌పీఎఫ్ బలగాలపైకి కాల్పులు జరపడంతో ఓ జవాన్ సహా ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయారు. బిజ్‌బెహెరా ఏరియాలో పాద్‌షాహీ బాగ్ బ్రిడ్జీ సమీపంలో రోడ్డుపైనే సీఆర్‌పీఎఫ్ 90 బెటాలియన్ పైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శుక్రవారం సుమారు 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాను, బాలుడిని ఆస్పత్రికి తరలించగా, పరిస్థితులు విశమించి అక్కడే తుదిశ్వాస విడిచారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసి ఆ ఏరియాలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.