దొంగదెబ్బతీశారు.. సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ : అమిత్ షా
దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్ జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. అయితే, కొందరి మృతదేహాలు లభ్యం కాగా, మరికొందరి ఆచూకీ ఇంకా లభించలేదు. కనిపించకుండా పోయిన జవాన్ల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కూంబింగ్ కోసం రెండు కొండల నడుమ నుంచి వెళ్తున్న జవాన్లపై మావోయిస్టులు దొంగదెబ్బ తీశారని పేర్కొన్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇరువైపులా ప్రాణనష్టం […]
దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్ జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. అయితే, కొందరి మృతదేహాలు లభ్యం కాగా, మరికొందరి ఆచూకీ ఇంకా లభించలేదు. కనిపించకుండా పోయిన జవాన్ల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.
కూంబింగ్ కోసం రెండు కొండల నడుమ నుంచి వెళ్తున్న జవాన్లపై మావోయిస్టులు దొంగదెబ్బ తీశారని పేర్కొన్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇరువైపులా ప్రాణనష్టం సంభవించినట్లు అధికారుల నుంచి సమాచారం అందిందన్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ కొనసాగుతోందని అమిత్ షా స్పష్టంచేశారు. ఇదిలాఉండగా, ఈ ఘటనపై భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అమరవీరుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.