చీర పేరుతో బంగారం చోరీ
దిశ, వెబ్ డెస్క్ : ఉచితంగా చీరలు ఇస్తున్నారని తెలిసి వెళ్లిన మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు చోరీ చేసిన ఘటన బుధవారం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..అల్గునూర్‌కు చెందిన వేముల లత కొత్తపల్లిలోని తన కూతురు ఇంటికి వెళుతూ వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద దిగింది. తరువాత ఆటో స్టాండ్ వద్దకు నడిచి వెళ్తుండగా ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి అక్కడ ఉచితంగా చీరలు పంచుతున్నారు మీరు త్వరగా వెళ్లండి. కానీ […]
దిశ, వెబ్ డెస్క్ : ఉచితంగా చీరలు ఇస్తున్నారని తెలిసి వెళ్లిన మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు చోరీ చేసిన ఘటన బుధవారం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం..అల్గునూర్‌కు చెందిన వేముల లత కొత్తపల్లిలోని తన కూతురు ఇంటికి వెళుతూ వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద దిగింది. తరువాత ఆటో స్టాండ్ వద్దకు నడిచి వెళ్తుండగా ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి అక్కడ ఉచితంగా చీరలు పంచుతున్నారు మీరు త్వరగా వెళ్లండి. కానీ మెడలో బంగారం వేసుకుని వెళ్లినవారికి ఇవ్వడు మీరు పుస్తెలతాడు తీసి బ్యాగులో దాచుకుని వెళ్లండీ మీకు కూడా ఓ చీర ఇస్తాడని చెప్పాడు.
అలానే మీకు పేపర్ ఇస్తాను అందులో మీ పుస్తెల తాడు దాచుకోండి అంటూ ఆమె పుస్తెల తాడుని పేపర్‌లో వేసిచుట్టాడు. ఆతరువాత వ్యక్తికన్నుమూసి తెరిసేంతలో..ఆమె పుస్తెలతాడు చుట్టినపేపరు తీసుకుని..ఖాళీ పేపర్‌ను లతకు ఇచ్చాడు. అది తీసుకుని.. చీరలు అయిపోతాయనే హడావిడితో బ్యాగులో వేసుకుంది.
దీంతో ఆ వ్యక్తి మీరు ఇక్కడే ఉండండీ..మీకోసం నేను వెళ్లి చీరలు తీసుకొస్తానని చెప్పి వెళ్లాడు. అతను చెప్పిన మాటలు నమ్మిన లత అక్కడే నిలబడింది. చీరలు తీసుకొస్తానంటూ వెళ్లి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన లత ఇక అతను రాడని ఇంకా ఎంత సేపు నిలబడతాం పుస్తెల తాడు మెడలో వేసుకుని వెళ్లిపోదాం అనుకుని..బ్యాగ్‌లోపేపర్ తీసిచూడగా దాంట్లోపుస్తెలతాడు కనిపించలేదు. దీంతో మోసపోయానని తెలుసుకుని..లబోదిబోమంటూ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.