కేరళలో కలకలం సృష్టిస్తున్న జికా వైరస్ కేసులు

తిరువనంతపురం : కేరళను జికా వైరస్ వదిలి పెట్టడం లేదు. తాజాగా రాష్ట్రంలో మరో రెండు జికా వైరస్ కేసులను అధికారులు గుర్తించారు. తిరువనంతపురంలోని కుమరపురానికి చెందిన మహిళ(42), కొల్లాంలోని కొట్టారాక్కరకు చెందిన మహిళ(30)లకు జికా పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు శనివారం వెల్లడించారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు జికా వైరస్ బారిన పడి వారి సంఖ్య 46కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. వారిలో ఎవరూ ఇప్పటివరకు ఆస్పత్రిలో చేరలేదని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా […]

Update: 2021-07-24 10:59 GMT

తిరువనంతపురం : కేరళను జికా వైరస్ వదిలి పెట్టడం లేదు. తాజాగా రాష్ట్రంలో మరో రెండు జికా వైరస్ కేసులను అధికారులు గుర్తించారు. తిరువనంతపురంలోని కుమరపురానికి చెందిన మహిళ(42), కొల్లాంలోని కొట్టారాక్కరకు చెందిన మహిళ(30)లకు జికా పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు శనివారం వెల్లడించారు.

తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు జికా వైరస్ బారిన పడి వారి సంఖ్య 46కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. వారిలో ఎవరూ ఇప్పటివరకు ఆస్పత్రిలో చేరలేదని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు అధికారులు చెప్పారు.

Tags:    

Similar News