దుర్గగుడిలో మరో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ దుర్గగుడి ఆలయంలో గత కొన్ని రోజులుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారుల సోదాల్లో అనేక అవినీతి విషయాలు వెలుగు చూశాయి. ఏసీబీ అధికారులు నివేదిక ఆధారంగా దుర్గగుడిలో అవినీతికి పాల్పడిన 13 మంది ఉద్యోగులపై దేవాదాయశాఖ సస్పెన్షన్‌ను విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. మాక్స్ సెక్యూరిటీకి టెండర్లు ఇవ్వడంలో ఉద్యోగుల పాత్ర ఉందని నిర్ధారించి సూపరింటెండెంట్ రవి ప్రసాద్, మరో అధికారి పద్మావతిని […]

Update: 2021-02-23 05:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ దుర్గగుడి ఆలయంలో గత కొన్ని రోజులుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారుల సోదాల్లో అనేక అవినీతి విషయాలు వెలుగు చూశాయి. ఏసీబీ అధికారులు నివేదిక ఆధారంగా దుర్గగుడిలో అవినీతికి పాల్పడిన 13 మంది ఉద్యోగులపై దేవాదాయశాఖ సస్పెన్షన్‌ను విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. మాక్స్ సెక్యూరిటీకి టెండర్లు ఇవ్వడంలో ఉద్యోగుల పాత్ర ఉందని నిర్ధారించి సూపరింటెండెంట్ రవి ప్రసాద్, మరో అధికారి పద్మావతిని సస్పెండ్ చేశారు. కాగా, దుర్గగుడి అవినీతి కేసులో ఇప్పటివరకూ మొత్తం 15 మంది అధికారులపై అధికారులు వేటు వేశారు.

Tags:    

Similar News