పోలీసుల ముందు లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

దిశ, ములుగు : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సౌత్ బస్తర్ 8 వ ప్లాటూన్ దళ సభ్యులు ఇద్దరు పోలీసులకు లొంగిపోయారు. ముచ్చా కి జోగా (25), పూనం బుద్రి (24) అనే ఇద్దరు దళ సభ్యులు మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ముందు లొంగిపోయారు. ‘మావోయిస్టు పార్టీలో చాలామంది అనారోగ్యానికి గురై సరైన చికిత్స అందకపోవడం వలన, కరోనా బారిన […]

Update: 2021-07-27 08:55 GMT

దిశ, ములుగు : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సౌత్ బస్తర్ 8 వ ప్లాటూన్ దళ సభ్యులు ఇద్దరు పోలీసులకు లొంగిపోయారు. ముచ్చా కి జోగా (25), పూనం బుద్రి (24) అనే ఇద్దరు దళ సభ్యులు మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ముందు లొంగిపోయారు. ‘మావోయిస్టు పార్టీలో చాలామంది అనారోగ్యానికి గురై సరైన చికిత్స అందకపోవడం వలన, కరోనా బారిన పడి మరణిస్తూ ఉండడం వలన భవిష్యత్తులో తాము కూడా కరోనాతో గాని మరేదైన కారణాలతోనైనా సరైన చికిత్స లేకుండా చనిపోతామేమోనని భయపడి, తమ కటంబ సభ్యులతో సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకొని ఈరోజు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోవడం జరిగింది’ అని వారు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా సోకిన మావోయిస్టు పార్టీ సభ్యులు, ముఖ్య నాయకులు ఎవరైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి పోలీస్ వారిని ఆశ్రయిస్తే వారికి మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. వారికి ప్రభుత్వం నుండి రావలసిన ప్రతిఫలాలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఓఎస్డీ శోభన్ కుమార్, ఏఎస్పీ పి.సాయి చైతన్య ఐపీఎస్, పసర సీఐ శ్రీనివాస్, ఎస్ఐ జి.రవీందర్ లతో పాటు ఉమెన్ ఎస్ ఐ మౌనిక సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News