కేరళలో రెండు రోజుల సంపూర్ణ లాక్‌డౌన్
తిరువనంతపురం: కేరళలో కరోనా పరిస్థితులను సమీక్షించిన తర్వాత రెండు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తు్న్నది. ఈ తరుణంలో 17వ, 18వ తేదీల్లో ఆంక్షలు అమలు చేయనున్నట్టు ప్రకటించింది. గతంలో ప్రకటించిన నిబంధనలే ఈ రెండు రోజుల లాక్‌డౌన్‌కు వర్తిస్తాయని తెలిపింది. బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌లు ఈ రెండు రోజుల్లో మూసే ఉంటాయని పేర్కొంది. ఇది వరకు గుర్తించినట్టు ఏబీసీడీ కేటగిరీల్లోనే షాపులు రాత్రి […]
తిరువనంతపురం: కేరళలో కరోనా పరిస్థితులను సమీక్షించిన తర్వాత రెండు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తు్న్నది. ఈ తరుణంలో 17వ, 18వ తేదీల్లో ఆంక్షలు అమలు చేయనున్నట్టు ప్రకటించింది. గతంలో ప్రకటించిన నిబంధనలే ఈ రెండు రోజుల లాక్‌డౌన్‌కు వర్తిస్తాయని తెలిపింది.
బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌లు ఈ రెండు రోజుల్లో మూసే ఉంటాయని పేర్కొంది. ఇది వరకు గుర్తించినట్టు ఏబీసీడీ కేటగిరీల్లోనే షాపులు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని వివరించింది. మంగళవారం రాష్ట్రంలో 14,539 కొత్త కేసులు, 124 మరణాలు చోటుచేసుకున్నాయి. కరోనా పరిస్థితులపై కేరళ సహా ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ శుక్రవారం వర్చువల్ కాన్ఫరెన్స్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే.