ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్..

దిశ, వెబ్‌డెస్క్ : తనకు న్యాయం చేయాలని పోలీసు‌స్టేషన్ మెట్లు ఎక్కిన వివాహితను చితకబాదిన కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు పోలీసు‌స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన భర్త గొర్రెల కాపరి రవిని హత్య చేశారని, అతనిది అనుమానాస్పద మృతి కాదని.. ఈ కేసులో తనకు న్యాయం చేయాలని రమాదేవి అనే వివాహిత వాయల్పాడు పోలీసులను ఆశ్రయించింది. అప్పటికే నిందితునితో కుమ్మక్కైన పోలీసులు రాజీ చేసుకోవాలని […]

Update: 2020-09-04 03:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

తనకు న్యాయం చేయాలని పోలీసు‌స్టేషన్ మెట్లు ఎక్కిన వివాహితను చితకబాదిన కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు పోలీసు‌స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తన భర్త గొర్రెల కాపరి రవిని హత్య చేశారని, అతనిది అనుమానాస్పద మృతి కాదని.. ఈ కేసులో తనకు న్యాయం చేయాలని రమాదేవి అనే వివాహిత వాయల్పాడు పోలీసులను ఆశ్రయించింది. అప్పటికే నిందితునితో కుమ్మక్కైన పోలీసులు రాజీ చేసుకోవాలని బాధితురాలికి వార్నింగ్ ఇచ్చారు. ఎంతకూ ఆమె వినకపోవడంతో మహిళను చితకబాదారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో మహిళపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని తేలడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ సంథిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News