కందకంలో పడి ఇద్ధరు చిన్నారులు మృతి

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. బానాపూర్ తండాలోని అటవీ ప్రాంతంలో తవ్విన కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. అటవీ ప్రాంతంలోని పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు భూక్య జగన్( 10), భూక్య శివ( 8) లను అడవి పందులు వెంబడించాయి. దీంతో పరుగెత్తుకుంటూ వచ్చిన చిన్నారులు … రిజర్వు ఫారెస్టు కోసం తవ్విన కందకంలో పడ్డారు. కాగా ఇటీవల […]

Update: 2020-10-20 08:55 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్:
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. బానాపూర్ తండాలోని అటవీ ప్రాంతంలో తవ్విన కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. అటవీ ప్రాంతంలోని పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు భూక్య జగన్( 10), భూక్య శివ( 8) లను అడవి పందులు వెంబడించాయి. దీంతో పరుగెత్తుకుంటూ వచ్చిన చిన్నారులు … రిజర్వు ఫారెస్టు కోసం తవ్విన కందకంలో పడ్డారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు కందకంలో నీరు చేరింది. దీంతో నీటిలో మునిగిపోయి ఇద్ధరు చిన్నారులు మరణించారు. దీనిపై లింగం పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News