‘పెగాసస్’ నిరసనల హోరు.. లోక్‌సభలో ‘మూజువాణి’ జోరు

న్యూఢిల్లీ: పార్లమెంటులో సోమవారమూ వాయిదాల పర్వమే కొనసాగింది. పెగాసస్, అగ్రి చట్టాలపై నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ఫలితంగా పలుసార్లు వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఇతర విపక్ష నేతలు వెల్‌లోకి దూసుకెళ్లాయి. అయితే, ప్రజా ప్రయోజన అంశాలపై చర్చను విపక్షాలు అడ్డుకుంటున్నాయని కేంద్రప్రభుత్వం ఆరోపించింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పెగాసస్ ట్యాపింగ్‌ను లేవదీశారు. అంతేకాకుండా పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. స్వార్థపూరిత […]

Update: 2021-07-26 20:11 GMT

న్యూఢిల్లీ: పార్లమెంటులో సోమవారమూ వాయిదాల పర్వమే కొనసాగింది. పెగాసస్, అగ్రి చట్టాలపై నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ఫలితంగా పలుసార్లు వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఇతర విపక్ష నేతలు వెల్‌లోకి దూసుకెళ్లాయి. అయితే, ప్రజా ప్రయోజన అంశాలపై చర్చను విపక్షాలు అడ్డుకుంటున్నాయని కేంద్రప్రభుత్వం ఆరోపించింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పెగాసస్ ట్యాపింగ్‌ను లేవదీశారు. అంతేకాకుండా పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. స్వార్థపూరిత లక్ష్యాల కోసం పెగాసస్‌ను కొనుగోలు చేయడానికి ప్రజాధనాన్ని వాడుకున్నట్టు అనుమానాలున్నాయని ఆరోపించారు. ఈ ఇష్యూపై ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు.

చర్చ లేకుండా పాస్..

నిరసనల హోరు కొనసాగుతుండగానే లోక్‌సభలో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. చర్చలేకుండా మూజువాణి ద్వారా ఈ బిల్లులకు ఆమోదం లభించింది. ఎంఎస్ఎంఈ రంగానికి ఉపకరించేలా సవరించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించిన ఫ్యాక్టోరింగ్ అమెండ్‌మెంట్ బిల్లును ప్రవేశపెట్టారు. రెండో బిల్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ బిల్లును ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పశుపతి కుమార్ పరాస్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఫుడ్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌లాంటి కొన్ని ఇన్‌స్టిట్యూషన్‌లను జాతీయ ప్రాధాన్యతను కల్పించనుంది.

Tags:    

Similar News