బాలికపై అత్యాచారం: ఇద్దరు నిందితుల అరెస్ట్
దిశ, ఖమ్మం: కిరణా షాపునకు వచ్చే విద్యార్థిపై కన్నేశాడు యజమాని. మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. అతనికి మరో వ్యక్తి జత కలిశాడు. ఇద్దరు కలసి రెండు నెలలుగా ఆ విద్యార్థిన్ని అత్యాచారం చేశారు. ఆపై వీడియోలు చిత్రీకరించారు. చివరికి జరిగిన విషయం సదురు బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారి బండారం బయటపడింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఓ విద్యార్థినిపై రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్న ఇద్దరు నిందితులను శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర అరెస్టు […]
దిశ, ఖమ్మం: కిరణా షాపునకు వచ్చే విద్యార్థిపై కన్నేశాడు యజమాని. మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. అతనికి మరో వ్యక్తి జత కలిశాడు. ఇద్దరు కలసి రెండు నెలలుగా ఆ విద్యార్థిన్ని అత్యాచారం చేశారు. ఆపై వీడియోలు చిత్రీకరించారు. చివరికి జరిగిన విషయం సదురు బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారి బండారం బయటపడింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఓ విద్యార్థినిపై రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్న ఇద్దరు నిందితులను శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండల కో ఆప్షన్ సభ్యుడి కొడుకు షానవాజ్ రామాంజనేయ కాలనీలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆ షాపుకు తరుచూ వచ్చి వెళ్లే ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి.. మార్చి 18న అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అదే ప్రాంతానికి చెందిన నగేష్ కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా సదరు బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేయడమే కాకుండా వీడియోలు చిత్రీకరించారు. తాము చెప్పినట్లు వినకుంటే వీడియోలు బయటపెడుతామని బాలికను బెదిరించారు. అలా బెదిరింపులకు పాల్పడుతూ సదరు విద్యార్థినిని రెండు మాసాలుగా లైంగికంగా వేధింపులకు గురి చేశారు. చివరిగా ఈ నెల 19న కూడా విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే ఆ విద్యార్థిని ధైర్యం చేసి అదేరోజు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేశారు. భద్రాచలం పోలీసులు శుక్రవారం నిందితులను అరెస్ట్ చేశారు.