ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ లాక్

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ట్విట్టర్, ఫేస్‌బుక్ షాక్ ఇచ్చింది. క్యాపిటల్ భవనంలోకి ట్రంప్ మద్దతుదారులు చొచ్చుకెళ్లి కాల్పులు జరిపిన నేపథ్యంలో ట్రంప్ చేసిన ట్వీట్లు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన పోస్టులను ట్విట్టర్, ఫేస్‌బుక్ తొలగించింది. క్యాపిటల్ భవనం ఘటనలో ట్రంప్ పోస్టులపై ట్విట్టర్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రంప్ వీడియోలను ఫేస్‌బుక్ తొలగించింది. ట్రంప్ ఖాతాను 12 గంటల పాటు ట్విట్టర్ లాక్ చేసింది. తమ నియమాలకు విరుద్ధంగా […]

Update: 2021-01-06 21:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ట్విట్టర్, ఫేస్‌బుక్ షాక్ ఇచ్చింది. క్యాపిటల్ భవనంలోకి ట్రంప్ మద్దతుదారులు చొచ్చుకెళ్లి కాల్పులు జరిపిన నేపథ్యంలో ట్రంప్ చేసిన ట్వీట్లు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన పోస్టులను ట్విట్టర్, ఫేస్‌బుక్ తొలగించింది. క్యాపిటల్ భవనం ఘటనలో ట్రంప్ పోస్టులపై ట్విట్టర్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రంప్ వీడియోలను ఫేస్‌బుక్ తొలగించింది. ట్రంప్ ఖాతాను 12 గంటల పాటు ట్విట్టర్ లాక్ చేసింది. తమ నియమాలకు విరుద్ధంగా చేసిన ట్వీట్లను తొలగించాలని ట్రంప్‌ను కోరింది. ట్వీట్లు తొలగించకపోతే ట్రంప్ ఖాతాను శాశ్వతంగా లాక్ చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన మూడు ట్వీట్లను తొలగించింది.

Tags:    

Similar News