బండ్ల, హరీష్ ట్వీట్ వార్
ఓ ఫ్యాన్ తన అభిమాన హీరోను డైరెక్ట్ చేస్తే.. హీరోయిజం ఏ రేంజ్‌లో ఉంటుందో చూపెట్టిన సినిమా గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ విడుదలై ఈ మధ్యే ఎనిమిదేళ్లయిన సందర్భంగా ఫ్యాన్స్.. సోషల్ మీడియాను హోరెత్తించిన సంగతి తెలిసిందే. దీంతో ‘సినిమా ఈ రోజే విడుదలైన ఫీలింగ్ వస్తోందని ఆనందం వ్యక్తం చేశాడు మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్’. అంతేకాదు ప్రతీఒక్క టెక్నీషియన్‌కు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ నోట్ రిలీజ్ చేశాడు. కానీ.. చిత్ర నిర్మాత […]
ఓ ఫ్యాన్ తన అభిమాన హీరోను డైరెక్ట్ చేస్తే.. హీరోయిజం ఏ రేంజ్‌లో ఉంటుందో చూపెట్టిన సినిమా గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ విడుదలై ఈ మధ్యే ఎనిమిదేళ్లయిన సందర్భంగా ఫ్యాన్స్.. సోషల్ మీడియాను హోరెత్తించిన సంగతి తెలిసిందే. దీంతో ‘సినిమా ఈ రోజే విడుదలైన ఫీలింగ్ వస్తోందని ఆనందం వ్యక్తం చేశాడు మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్’. అంతేకాదు ప్రతీఒక్క టెక్నీషియన్‌కు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ నోట్ రిలీజ్ చేశాడు. కానీ.. చిత్ర నిర్మాత బండ్ల గణేష్‌ను మాత్రం మరిచిపోయాడు. ఆ తర్వాత రియలైజ్ అయిన హరీష్.. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్‌కు కృతజ్ఞతలు అంటూ మరో ట్వీట్ చేశాడు. కానీ.. ఈ విషయం బండ్లను కాస్త హర్ట్ చేసినట్టుంది. దీంతో ఆయన ఇన్‌డైరెక్ట్‌గా హరీష్‌ను తిట్టిపోస్తూ ట్వీట్ చేస్తున్నాడు.
తాజాగా బండ్ల పెడుతున్న పోస్ట్‌లు హరీష్‌ను టార్గెట్ చేసినట్లే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మా గబ్బర్ సింగ్ చిత్రానికి వెన్నెముక త్రివిక్రమ్ శ్రీనివాస్ అని పొగడ్తలు కురిపించిన బండ్ల.. హరీష్‌కు తానే అవకాశం ఇచ్చానని చెప్పుకొచ్చారు. దీంతో మండిపోయిన హరీష్ శంకర్ అసలు ఈ సినిమాకు నిర్మాత నాగబాబు ఉండాల్సింది.. పవన్ దయతలచి బండ్ల గణేష్‌కు అవకాశం ఇచ్చాడని చెప్పాడు.
దీనికి కౌంటర్‌గా మరో ట్వీట్ చేసిన బండ్ల.. ఓ సామెతను వాడాడు. ‘తింటున్నంత సేపు ఇస్తారాకు అంటారు.. తిన్నాక ఎంగిలాకు అంటారు.. కొందరు మనుషులు అంతే’ అంటూ మండిపడ్డాడు. మరి ఈ ఇస్తారాకు, ఎంగిలాకు విమర్శలు హరీష్ గురించేనా ? లేక మామూలుగా పెట్టాడా ? అని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.