జస్టిస్ ఫర్ జైరాజ్, ఫెనిక్స్.. సెలబ్రిటీల పిలుపు

అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ హత్య గురించి ఆందోళనలు వెల్లువెత్తాయి. పోలీసుల అణచివేత, జాతి దురహంకారం గురించి నిరసనలు మిన్నంటాయి. బ్లాక్ లివ్స్ మ్యాటర్, ఆల్ లివ్స్ మ్యాటర్ అంటూ న్యాయం కోసం పోరాడారు. అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడులోనూ చోటుచేసుకుంది. లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించారనే నెపంతో జూన్ 19న తండ్రీకొడుకులు జైరాజ్, ఫెనిక్స్‌లను చాలా క్రూరంగా హత్య చేశారు సతంకులం పోలీసులు. మూడు రోజుల పాటు నరకం చూపించి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కోవిల్‌పట్టి ఆస్పత్రిలో […]

Update: 2020-06-26 04:17 GMT

అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ హత్య గురించి ఆందోళనలు వెల్లువెత్తాయి. పోలీసుల అణచివేత, జాతి దురహంకారం గురించి నిరసనలు మిన్నంటాయి. బ్లాక్ లివ్స్ మ్యాటర్, ఆల్ లివ్స్ మ్యాటర్ అంటూ న్యాయం కోసం పోరాడారు.

అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడులోనూ చోటుచేసుకుంది. లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించారనే నెపంతో జూన్ 19న తండ్రీకొడుకులు జైరాజ్, ఫెనిక్స్‌లను చాలా క్రూరంగా హత్య చేశారు సతంకులం పోలీసులు. మూడు రోజుల పాటు నరకం చూపించి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కోవిల్‌పట్టి ఆస్పత్రిలో చేర్చగా జూన్ 22న ఫెనిక్స్, జూన్ 23న జైరాజ్ చనిపోయారు.

టుటికోరిన్ ఘటన తమిళనాట సంచలనం సృష్టించగా.. దీనిపై న్యాయం కోసం డిమాండ్ చేస్తూ హీరోయిన్ ఖుష్బూ సుందర్, హీరో జయం రవి, సింగర్ సుచరిత లాంటి ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఎక్కడో అమెరికాలో జరిగిన ఘటనకు మద్దతిచ్చిన మనం ఈ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాడాలని కోరారు. నిందితులను సస్పెండ్ చేయడంతో ఆ కుటుంబానికి న్యాయం జరిగినట్లు కాదన్నారు.

Tags: Khushbu sundar, Jayam Ravi, Sucharita, Kollywood, justice for jairam fenix

Slug:

Tags:    

Similar News