ఆప్కోస్‌లో విలీనం వద్దు

దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏపీ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌ (ఆప్కోస్)లో తమను విలీనం చేయాల‌ని తీసుకున్న నిర్ణ‌యాన్ని టీటీడీ బోర్డు వెంట‌నే ఉపసంహరించాల‌ని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. సీఐటీయూతోపాటు టీటీడీలోని ఎస్‌డ‌బ్ల్యూఎఫ్‌ ఉద్యోగ సంఘాలు మ‌ద్ద‌తు తెలిపాయి. త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే వ‌రకు నిర‌స‌న దీక్ష కొన‌సాగుతుంద‌ని ఔట్‌సోర్సింగ్ కార్మికులు స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఉదయం 9 […]

Update: 2020-08-17 09:16 GMT

దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏపీ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌ (ఆప్కోస్)లో తమను విలీనం చేయాల‌ని తీసుకున్న నిర్ణ‌యాన్ని టీటీడీ బోర్డు వెంట‌నే ఉపసంహరించాల‌ని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. సీఐటీయూతోపాటు టీటీడీలోని ఎస్‌డ‌బ్ల్యూఎఫ్‌ ఉద్యోగ సంఘాలు మ‌ద్ద‌తు తెలిపాయి. త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే వ‌రకు నిర‌స‌న దీక్ష కొన‌సాగుతుంద‌ని ఔట్‌సోర్సింగ్ కార్మికులు స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు.

Tags:    

Similar News