ఎస్వీబీసీలో ప్రకటనలు రద్దు
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్ సడలింపు తరువాత రోజూ 6 వేల మంది భక్తులకు దర్శనాలు కల్పిస్తున్న టీటీడీ తాజాగా దర్శనాల సంఖ్యను పెంచుతున్నట్టు ప్రకటించారు. రోజూ 6750 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఇందులో రోజుకు మూడు వేల మందికి ఉచిత దర్శనం టోకెన్లను ఇవ్వాలని నిర్ణయించింది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఉచిత దర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. తిరుపతిలోని విష్ణు నివాసంలో 8 […]
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్ సడలింపు తరువాత రోజూ 6 వేల మంది భక్తులకు దర్శనాలు కల్పిస్తున్న టీటీడీ తాజాగా దర్శనాల సంఖ్యను పెంచుతున్నట్టు ప్రకటించారు. రోజూ 6750 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఇందులో రోజుకు మూడు వేల మందికి ఉచిత దర్శనం టోకెన్లను ఇవ్వాలని నిర్ణయించింది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఉచిత దర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. తిరుపతిలోని విష్ణు నివాసంలో 8 కౌంటర్లు, శ్రీనివాసంలో 6 కౌంటర్లు, అలిపిరివద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 18 కౌంటర్లలో 3 వేల ఉచిత దర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. దీంతో గత అర్ధ రాత్రి నుంచే భక్తులు టోకెన్ల కోసం బారులు తీరారు. ఈ నెల 30 వరకూ టికెట్లను జారీ చేశామని, వచ్చే నెల 11 వరకూ ఆన్ లైన్ టికెట్ల కోటా పూర్తయిందని, ఆపై టికెట్లను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.
మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ)లో ప్రకటనలు విసుగు తెప్పించేలా ఉండడంతో భక్తుల నుంచి దేవస్థానానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో చానల్‌ను ఇకపై యాడ్‌ఫ్రీగా మార్చాలని టీటీడీ నిర్ణయించింది. తమకు ఆదాయ వనరుల కంటే భక్తుల మనోభావాలే ముఖ్యమని ప్రకటించిన టీటీడీ యాడ్స్ నిలిపేస్తున్నామని ప్రకటించింది. ఛానల్ నిర్వహణకు భక్తులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తే స్వీకరిస్తామని పేర్కొంది. కాగా, చానల్ నిర్వహణ కోసం భక్తుల నుంచి ఇప్పటికే 25 లక్షల రూపాయల విరాళాలు అందినట్టు టీటీడీ వెల్లడించింది.