Tirupati News : మెట్టు మార్గంలో శ్రీవారి భక్తుల నిలువు దోపిడి..

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి పుణ్యమా అని తిరుమల శ్రీవారి భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఏపీలో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతుండటంతో పాటు కొవిడ్ నియంత్రణలో భాగంగా ఆన్లైన్ దర్శనం టిక్కెట్లను 5 వేలకు కుదించారు. ఇకపోతే అలిపిరి మార్గంలో నడక దారి భక్తులను అనుమతించడం లేదు. ఆ దారిలో మరమ్మత్తులు చేస్తుండటంతో భక్తులను మెట్టుమార్గం గుండా వెళ్లాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులు చుక్కలు చూస్తున్నారు. మధ్యాహ్నం 12 […]

Update: 2021-06-02 03:04 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి పుణ్యమా అని తిరుమల శ్రీవారి భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఏపీలో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతుండటంతో పాటు కొవిడ్ నియంత్రణలో భాగంగా ఆన్లైన్ దర్శనం టిక్కెట్లను 5 వేలకు కుదించారు. ఇకపోతే అలిపిరి మార్గంలో నడక దారి భక్తులను అనుమతించడం లేదు. ఆ దారిలో మరమ్మత్తులు చేస్తుండటంతో భక్తులను మెట్టుమార్గం గుండా వెళ్లాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులు చుక్కలు చూస్తున్నారు.

మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ ప్రారంభం అవుతుండటంతో మెట్టు మార్గం ద్వారా వెళ్లేవారిని కొందరిని సిబ్బంది నిలిపివేస్తున్నారు. బస్సుల సమాచారం లేకపోవడంతో 12లోపు మెట్టు మార్గం గుండా వెళ్లాలనుకునే భక్తులు ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించి భక్తులను వారు నిలువు దోపిడి చేస్తున్నారు. 22కిలో మీటర్ల దూరానికే అక్కడి ఆటోవాలాలు రూ.500 నుంచి 600 చార్జీలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తుగా టీటీడీ వెబ్ పోర్టల్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు సైతం శ్రీవారిని సందర్శించుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

Tags:    

Similar News