హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ కార్యక్రమాలు

దిశ, వెబ్ డెస్క్: ఎస్వీబీసీని యాడ్‌ ఫ్రీ ఛానల్‌గా మార్చాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందీ, కన్నడ భాషల్లో కూడా త్వరలో ఎస్వీబీసీ కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దాతల విరాళాలతోనే ఛానెల్ నడుపుతామని .. త్వరలోనే ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవ సేవను జరుపునున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా బారిన పడిన టీటీడీ అర్చకులందరూ కోలుకున్నారని సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి భక్తుల దర్శనాల సంఖ్య ఇప్పట్లో పెంచే […]

Update: 2020-07-30 10:58 GMT
హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ కార్యక్రమాలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఎస్వీబీసీని యాడ్‌ ఫ్రీ ఛానల్‌గా మార్చాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందీ, కన్నడ భాషల్లో కూడా త్వరలో ఎస్వీబీసీ కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

దాతల విరాళాలతోనే ఛానెల్ నడుపుతామని .. త్వరలోనే ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవ సేవను జరుపునున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా బారిన పడిన టీటీడీ అర్చకులందరూ కోలుకున్నారని సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి భక్తుల దర్శనాల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన చేయడం లేదన్నారు.

Tags:    

Similar News