విద్యుత్ సరఫరా లేకపోతే ఫిర్యాదు చేయండి

దిశ, న్యూస్‌బ్యూరో: భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 7382072104, 7382072106,7382071574 లకు ఫిర్యాదు చేయాలని టీఎస్ఎస్సీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి కోరారు. ప్రజలు రోడ్లపై, భవనాలపై తెగి పడ్డ తీగల విషయం‌లో అప్రమత్తం‌గా ఉండాలని, వాటిని తాకకుండా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా పై ప్రజలను అప్రమత్తం చేస్తూ రఘుమారెడ్డి సోమవారం ఒక ప్రకటన […]

Update: 2020-08-17 08:58 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 7382072104, 7382072106,7382071574 లకు ఫిర్యాదు చేయాలని టీఎస్ఎస్సీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి కోరారు. ప్రజలు రోడ్లపై, భవనాలపై తెగి పడ్డ తీగల విషయం‌లో అప్రమత్తం‌గా ఉండాలని, వాటిని తాకకుండా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా పై ప్రజలను అప్రమత్తం చేస్తూ రఘుమారెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక వేళ అపార్ట్ మెంట్ సెల్లార్లలో వరద నీరు చేరితే వెంటనే సంబంధిత విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. ప్రజలు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల, ట్రాన్స్ ఫార్మర్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటిని తాకకుండా దూరంగా నడవాలని సూచించారు. వోల్టేజ్‌లో హెచ్చు తగ్గులు ఉన్నా, ట్రాన్స్‌ఫార్మర్‌ల నుంచి శబ్దం వస్తుంటే వెంటనే ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

Tags:    

Similar News