బస్సుల కండీషన్ చెక్ చేయండి
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ నుంచి బస్సులన్నీ డిపోలకే పరిమితమై ఉన్నందున వాటి కండీషన్ చెక్ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా టీఎస్ఆర్టీసీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ డిపో మేనేజర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సంస్థలో అంతర్గత సర్క్యులర్ జారీ చేశారు. బస్సులన్నీ నెలకుపైగా నడవకుండా ఉన్నందున టైర్లు, బ్రేకులు, మిగతా ముఖ్య భాగాలన్నీ తనిఖీ చేయాలని గ్యారేజీ ఇంచార్జిలను కోరారు. బస్సుల విడిభాగాల కొనుగోలులో సింహభాగం నిధులు టైర్లకే కేటాయిస్తున్నందున […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ నుంచి బస్సులన్నీ డిపోలకే పరిమితమై ఉన్నందున వాటి కండీషన్ చెక్ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా టీఎస్ఆర్టీసీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ డిపో మేనేజర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సంస్థలో అంతర్గత సర్క్యులర్ జారీ చేశారు. బస్సులన్నీ నెలకుపైగా నడవకుండా ఉన్నందున టైర్లు, బ్రేకులు, మిగతా ముఖ్య భాగాలన్నీ తనిఖీ చేయాలని గ్యారేజీ ఇంచార్జిలను కోరారు. బస్సుల విడిభాగాల కొనుగోలులో సింహభాగం నిధులు టైర్లకే కేటాయిస్తున్నందున వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బస్సులు డ్యామేజీ, ఫెయిల్ కాకుండా ఎప్పటికప్పుడు వాటిని కండీషన్‌లో ఉంచాలని సూచించారు.