తెలంగాణ నిరుద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ఉద్యోగ నోటిఫికేషన్ అవాస్తవం
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ ఎన్పీడీసీఎల్ సంస్థలో జేఏవో పోస్టు నోటిఫికేషన్ వచ్చినట్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, అదంతా అవాస్తవమని సంస్థ జాయింట్ డైరెక్టర్ కే రమేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తమ సంస్థలో నియామకాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్లు వేయలేదన్నారు. నిరుద్యోగులు వీటిని నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ఇది పూర్తిగా ఆకతాయిల చర్యగా పేర్కొన్నారు. ఈ వదంతులు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రమేశ్ తెలిపారు. నోటిఫికేషన్లకు […]
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ ఎన్పీడీసీఎల్ సంస్థలో జేఏవో పోస్టు నోటిఫికేషన్ వచ్చినట్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, అదంతా అవాస్తవమని సంస్థ జాయింట్ డైరెక్టర్ కే రమేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తమ సంస్థలో నియామకాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్లు వేయలేదన్నారు. నిరుద్యోగులు వీటిని నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ఇది పూర్తిగా ఆకతాయిల చర్యగా పేర్కొన్నారు. ఈ వదంతులు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రమేశ్ తెలిపారు. నోటిఫికేషన్లకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ అయినా అధికారిక వెబ్ సైట్ www.tsnpdcl.in ద్వారా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఎవరైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు.