పైసల మత్తులో పోలీసులు..?

దిశ, క్రైమ్ బ్యూరో : అప్పనంగా వచ్చిన డబ్బులకు ఆశపడి అసలు డ్యూటీని వదిలేస్తున్నారు కొందరు పోలీసు అధికారులు.. రియల్టర్లకు దాసోహమని కాసుల దాహాన్ని తీర్చుకుంటున్నారు.. చట్టం, ధర్మం అనేవి గాలికొదిలేసి, సెటిల్​మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు.. బాధితులను రక్షించాల్సింది పోయి బడాబాబుల కొమ్ముకాస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు.. చేతిలో ఉన్న పవర్​తో సామాన్యుడిని భయపెడుతూ, వారి కలలను కల్లలు చేస్తున్నారు.. చట్టానికి పహారా కాస్తూ సంఘవిద్రోహుల తోకలు కత్తిరించాల్సిన వారు బాధితులకే చుక్కలు చూపుతున్నారు.. తమ […]

Update: 2020-09-07 00:52 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : అప్పనంగా వచ్చిన డబ్బులకు ఆశపడి అసలు డ్యూటీని వదిలేస్తున్నారు కొందరు పోలీసు అధికారులు.. రియల్టర్లకు దాసోహమని కాసుల దాహాన్ని తీర్చుకుంటున్నారు.. చట్టం, ధర్మం అనేవి గాలికొదిలేసి, సెటిల్​మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు.. బాధితులను రక్షించాల్సింది పోయి బడాబాబుల కొమ్ముకాస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు.. చేతిలో ఉన్న పవర్​తో సామాన్యుడిని భయపెడుతూ, వారి కలలను కల్లలు చేస్తున్నారు.. చట్టానికి పహారా కాస్తూ సంఘవిద్రోహుల తోకలు కత్తిరించాల్సిన వారు బాధితులకే చుక్కలు చూపుతున్నారు.. తమ ఘనకార్యాలతో పోలీస్​శాఖకే మాయని మచ్చ తెస్తున్నారు.

శాంతి భద్రతల పరిరక్షణకు లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షించాల్సిన పోలీసులు, అందులోని లా వదిలేసి కేవలం ఆర్డర్లు మాత్రమే వేస్తున్నారు. యూనిఫాం ఉందనే అహంకారంతో ఇష్టారీతిగా వ్యవహారిస్తున్నారు. కబ్జాదారులకు, రియల్టర్లకు వత్తాసు పలుకుతున్నారు. సంబంధం లేకున్నా సివిల్ వివాదాల్లో తల దూరుస్తూ సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కోట్లు గడిస్తున్నారు. వసూళ్లకే అధిక ప్రాధాన్యం ఇస్తూ విధుల్ని గాలికొదిలేస్తున్నారు. ఈ క్రమంలో కడుపు మండిన బాధితులు ఉన్నతాధికారులకు గోడు వెళ్లబోసుకుంటే అసలు నిజాలు వెలుగు వస్తున్నాయి. అప్పుడు సస్పెన్షన్లు అవుతున్నా తరుచూ ఇలాంటి ఘటనలు జరగడం శాఖకు తలనొప్పులను తెస్తోంది.

భూ కబ్జాలలో జోరుగా జోక్యం..

చాలా మంది పేదలు పైసాపైసా పోగేసి పిల్లల అవసరాల దృష్ట్యా నగర శివారుల్లో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల్లోనే వాటి ధరలు అమాంతం పెరుగడంతో రియల్టర్లకు కళ్లు కుట్టి వాటిని ఆక్రమించుకుంటున్నారు. రెక్కాడితే డొక్కాడని కష్టజీవులు ఏళ్లకు ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగే స్థోమత లేక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితుల కన్నీటిని పెట్టుబడిగా భావించే రక్షకభటులు రియల్టర్లకు మచ్చికై, వారిచ్చే ఆఫర్లతో కోట్లకు పడగలెత్తుతున్నారు. పేదలకు న్యాయం చేయకపోగా వారి కలలన కాల రాస్తున్నారు. ప్రత్యేక రాష్ర్టం అనంతరం తెలంగాణ సర్కార్​ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చినా, మన పోలీసుల్లో కొందరి ప్రవర్తన మాత్రం మారడం లేదని బాధితులు వాపోతున్నారు.

మచ్చుకు కొందరు అ%E

Tags:    

Similar News