ఈహెచ్‌ఎస్ కోసం టీఎస్ మెసా డిమాండ్

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా బారిన పడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వర్తింపజేయాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) డిమాండ్ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను టీఎస్ మెసా రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడుతుండడం ఆందోళన కల్గిస్తోందన్నారు. దీంతో […]

Update: 2020-08-04 06:16 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా బారిన పడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వర్తింపజేయాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) డిమాండ్ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను టీఎస్ మెసా రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడుతుండడం ఆందోళన కల్గిస్తోందన్నారు. దీంతో వైద్యానికి లక్షల రూపాయలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వెంటనే ఈహెచ్ఎస్ వర్తింపజేసేలా చూడాలని ఫారూఖ్ అహ్మద్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News