డీజీపీ మహేందర్ రెడ్డికి ఓ రేంజ్ ఫాలోయింగ్..

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఫాలోయింగ్ మాములుగా లేదు. అనతి కాలంలోనే ఆయన ఈ రికార్డును సాధించారు. అదేంటంటే.. డీజీపీని ట్విట్టర్‍లో మూడు లక్షలు మంది ఫాలో అవుతున్నారు. ఈ విషయాన్ని మహేందర్‍రెడ్డి స్వయంగా ట్వీట్‍ ద్వారా వెల్లడించారు. ఈ మైలురాయిని చేరుకోవడం సంతోషంగా ఉందని.. ఇది తమ బాధ్యతలను మరింత పెంచిందన్నారు. Grateful to everyone, the 300000 #PeopleOfTelangana for your support through tweet-acts being connected here […]

Update: 2020-08-07 06:44 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఫాలోయింగ్ మాములుగా లేదు. అనతి కాలంలోనే ఆయన ఈ రికార్డును సాధించారు. అదేంటంటే.. డీజీపీని ట్విట్టర్‍లో మూడు లక్షలు మంది ఫాలో అవుతున్నారు. ఈ విషయాన్ని మహేందర్‍రెడ్డి స్వయంగా ట్వీట్‍ ద్వారా వెల్లడించారు. ఈ మైలురాయిని చేరుకోవడం సంతోషంగా ఉందని.. ఇది తమ బాధ్యతలను మరింత పెంచిందన్నారు.

ఇటీవల కాలంలో నేరాలను తగ్గించడంలో తెలంగాణ పోలీసులు చురుకైనా పాత్ర పోషిస్తున్నారు. అపదలో ఉన్నవారికి సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు స్వీకరిస్తూ పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రజల నుంచి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఆపై వెంటనే స్పందిస్తూ ఇందుకు సంబంధిత ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో అతి తక్కువ కాలంలోనే డీజీపీ ట్విట్టర్‍ ప్రజలకు చేరువైంది. శాంతి భద్రతలతో పాటు, పోలీసు శాఖకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులైనా డీజీపీ హ్యాండిల్‍కు ట్వీట్‍ చేయగానే వేగంగా స్పందించారన్న పేరుంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే తమకు న్యాయం జరుగుతుండటం పట్ల జనం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ట్విట్టర్ వాడకంలోనూ.. ఫాలోయింగ్ లోనూ తెలంగాణ డీజీపీ దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.

Tags:    

Similar News