షీ టీమ్స్‌ను అభినందిస్తూ డీజీపీ ట్వీట్

దిశ, నల్లగొండ: జిల్లా షీటీమ్ పోలీసులను డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పలువురి మహిళలను టార్గెట్ చేసుకొని లైంగికంగా వేధిస్తున్న అఖిల్ అలియాస్ చందును అత్యంత చాకచక్యంగా ఆరెస్ట్ చేయడంలో నల్లగొండ షీ టీమ్, వన్ టౌన్ పోలీసులు, ఐటీ సెల్ సిబ్బంది కనబర్చిన పనితీరు పట్ల డీజీపీ ట్విట్టర్ ద్వారా అభినందించారు. 2020ను మహిళా రక్షణ సంవత్సరంగా నిర్ణయించిన క్రమంలో రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా పని చేస్తూ మహిళల రక్షణపై నిబద్ధతతో పని చేయాలని […]

Update: 2020-06-10 05:35 GMT
షీ టీమ్స్‌ను అభినందిస్తూ డీజీపీ ట్వీట్
  • whatsapp icon

దిశ, నల్లగొండ: జిల్లా షీటీమ్ పోలీసులను డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పలువురి మహిళలను టార్గెట్ చేసుకొని లైంగికంగా వేధిస్తున్న అఖిల్ అలియాస్ చందును అత్యంత చాకచక్యంగా ఆరెస్ట్ చేయడంలో నల్లగొండ షీ టీమ్, వన్ టౌన్ పోలీసులు, ఐటీ సెల్ సిబ్బంది కనబర్చిన పనితీరు పట్ల డీజీపీ ట్విట్టర్ ద్వారా అభినందించారు. 2020ను మహిళా రక్షణ సంవత్సరంగా నిర్ణయించిన క్రమంలో రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా పని చేస్తూ మహిళల రక్షణపై నిబద్ధతతో పని చేయాలని సూచించారు. మహిళల రక్షణలో రాజీ లేకుండా పని చేయాలని షీ టీమ్స్‌కు డీజీపీ సూచించారు.

Tags:    

Similar News