TRS గెలుపు ఖాయం: మంత్రి హరీష్‌ రావు

దిశ,మెదక్: కేంద్ర ప్రభుత్వం యాసంగి బాయిల్డ్ రైస్‌‌‌ను మిల్లర్ల నుంచి కొనుగోలు చేయకపోవటం వల్లే.. వడ్ల కొనుగోలులో సమస్యలు తలెత్తుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి తరఫున మెదక్‌ కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సమక్షంలో మంత్రి హరీష్‌ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యాదవ రెడ్డి గెలుపు ఖాయమని జోష్యం చెప్పారు. మెుత్తం […]

Update: 2021-11-23 11:19 GMT

దిశ,మెదక్: కేంద్ర ప్రభుత్వం యాసంగి బాయిల్డ్ రైస్‌‌‌ను మిల్లర్ల నుంచి కొనుగోలు చేయకపోవటం వల్లే.. వడ్ల కొనుగోలులో సమస్యలు తలెత్తుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి తరఫున మెదక్‌ కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సమక్షంలో మంత్రి హరీష్‌ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యాదవ రెడ్డి గెలుపు ఖాయమని జోష్యం చెప్పారు. మెుత్తం ఓటర్లలో 777 మంది ఓటర్లు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులేననీ, కేవలం 250 వరకు మాత్రమే కాంగ్రెస్‌, బీజేపీలకు సంబంధించిన వారు ఓటర్లుగా ఉన్నారని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మెుదటిసారిగా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలకు ఓటు కల్పించిందని తెలిపారు. బలము లేని చోట పోటీ చేయటం ప్రజాస్వామ్య విరుద్ధమనీ, విలువలతో కూడినది కాదనీ హరీష్‌ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రైతుల సమస్యలపై అవగాహని లేదని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పద్మావతి దేవేందర్‌ రెడ్డి, మదన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మాణిక్ రావు, క్రాంతి కుమార్, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News