గోవా కేంద్రంగా చక్రం తిప్పుతున్న టీఆర్ఎస్.. ఎమ్మెల్సీ ఎన్నికలే టార్గెట్..!
దిశ, పాల్వంచ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు గెలుపుకు అధికార పార్టీ అన్ని విధాలా సిద్ధమౌతోంది.ఇప్పటికే ఆ పార్టీ తాయిలాల దోబూచులాటకు తెరలేపింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకొని..ఎలాగైనా గెలిచేలా కార్యాచరణ చేపట్టింది. డబ్బుతో పాటు వినోదాన్ని పంచేలా శిబిరాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గోవా తరలింపునకు రంగం సిద్ధం చేసిన టీఆర్ఎస్ ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు గెలుపే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే జిల్లా మంత్రి పువ్వాడ […]
దిశ, పాల్వంచ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు గెలుపుకు అధికార పార్టీ అన్ని విధాలా సిద్ధమౌతోంది.ఇప్పటికే ఆ పార్టీ తాయిలాల దోబూచులాటకు తెరలేపింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకొని..ఎలాగైనా గెలిచేలా కార్యాచరణ చేపట్టింది. డబ్బుతో పాటు వినోదాన్ని పంచేలా శిబిరాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గోవా తరలింపునకు రంగం సిద్ధం చేసిన టీఆర్ఎస్ ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు గెలుపే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టింది.
ఇప్పటికే జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి కన్వీనర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన అధికార పార్టీ ఆ దిశగా అడుగులు వేసేందుకు వేస్తోంది. గురువారం కొత్తగూడెం శాసన సభ్యులు వనమా స్వగృహం పాత పాల్వంచలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. జిల్లా, నియోజకవర్గ బాధ్యులు, కౌన్సిలర్లు, జడ్ పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, ప్రజాప్రతినిధులకు ఎన్నిక చేపట్టాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
డబ్బే కీలకమా..?
అధికార తెరాస.. ఈ ఎన్నికలో గెలిచేందుకు డబ్బుని వెదజల్లేందుకు సిద్ధమౌతుందనే ప్రచారం లేకపోలేదు.ఓటుకు రూ 3నుండి 5 లక్షలు ముట్ట చెప్పేందుకు సిద్ధమని ఆ పార్టీ కీలక నేతల నుంచి వినిపిస్తున్న వాదన. హుజూరాబాద్ బై ఎలక్షన్‌లో అధికార పార్టీ కోట్లు కుమ్మరించినా ఓటమి పాలైంది. అదే హవా కొనసాగితే భవిష్యత్ ఎన్నికల్లో తెరాస ఉనికి గల్లంతయ్యే ప్రమాదముందని.. అధికార తెరాస ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజింగ్‌గా తీసుకున్నట్టు తెలిసింది.
గోవానే శిబిరమా..?
ఇతర పార్టీ అభ్యర్థుల ప్రచారం ఎలాఉన్నా.. టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థుల గెలుపునకు భారీ డబ్బు సంచులతో పాటు ఓటర్లకు వినోదాన్ని పంచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందుకు గోవా వేదికగా ఖరారైనట్లు తెలుస్తోంది. డబ్బే ప్రామాణికంగా ఓట్లను రాబట్టే చర్యలకు సర్వం సిద్ధమైనట్లు వినికిడి.