నోట్లకట్టలు కాలిపోయింది ఆయన కారులో కాదా?

దిశ, హాలియా: దొండే.. దొంగా దొంగా అన్నట్లుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం పల్లా మీడియాతో మాట్లాడుతూ… సాగర్ ఉప ఎన్నికల్లో ముందే ఓటమిని గ్రహించిన కాంగ్రెస్ నేతలు నీతి మాలిన చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓ వైపు అసత్యాలు, అభూత కల్పనలతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జానారెడ్డి గెలవలేక తమ బంధువులను ఉసిగొల్పుతున్నారని అన్నారు. 2014 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ కారులో […]

Update: 2021-04-13 11:34 GMT
Palla Rajeshwar Reddy
  • whatsapp icon

దిశ, హాలియా: దొండే.. దొంగా దొంగా అన్నట్లుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం పల్లా మీడియాతో మాట్లాడుతూ… సాగర్ ఉప ఎన్నికల్లో ముందే ఓటమిని గ్రహించిన కాంగ్రెస్ నేతలు నీతి మాలిన చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓ వైపు అసత్యాలు, అభూత కల్పనలతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జానారెడ్డి గెలవలేక తమ బంధువులను ఉసిగొల్పుతున్నారని అన్నారు. 2014 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ కారులో నోట్లకట్టలు తరలిస్తుంటే కాలిపోయింది మర్చిపోయారా అని గుర్తుచేశారు. తాజాగా నిడమనూరులో ఆయన బస చేసిన ఇంట్లో మద్యం సీసాలు లభించాయని ఆరోపణలు చేశారు. సాగర్ ఎన్నికల నిబంధనలకు అనుగునంగానే టీఆర్ఎస్ ప్రచారం కొనసాగుతోందని, కానీ కాంగ్రెస్ నాయకులు కుట్రలు కుయుక్తులకు తెరలేపారన్నారు.

Tags:    

Similar News