కేంద్రం తీరుకు వ్యతిరేకంగా TRS నేతల నిరసన.. మోడీ దిష్టిబొమ్మ దహనం
దిశ, తిరుమలాయపాలెం : వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ నేపథ్యంలో నిరసనలో పాల్గొన్న పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని మోడీ ప్రభుత్వం కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. మోడీ తీరు రైతుల నడ్డివిరిచేలా ఉన్నదని ఆయన మండిపడ్డారు. అనంతరం మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ […]
దిశ, తిరుమలాయపాలెం : వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ నేపథ్యంలో నిరసనలో పాల్గొన్న పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని మోడీ ప్రభుత్వం కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. మోడీ తీరు రైతుల నడ్డివిరిచేలా ఉన్నదని ఆయన మండిపడ్డారు. అనంతరం మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని స్వర్ణ కుమారి, మండల ఎంపీపీ బొడ మంగీలాల్, టి.పాలెం పీఏసీఎస్ చైర్మన్ చావా వేణుగోపాలకృష్ణ, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు, ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ చావా శివరామకృష్ణ, కో-ఆప్షన్ మెంబర్ సైఫుద్దీన్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాషిబోయిన వీరన్న, మండల నాయకులు ఆర్మీ రవి, ఇస్లావత్ చంద్రునాయక్, బత్తుల రవికుమార్, చిర్రా కృష్ణ, పోలేపొంగు వెంకటేశ్వర్లు, సిరిగద్దె ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.