ప్రజా సంక్షేమం మోడీ సర్కార్‌కు గిట్టదు: జీవన్‌రెడ్డి
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజా సంక్షేమం మోడీ సర్కార్‌కు గిట్టదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్ అసెంబ్లీ కార్యాలయంలో ఆయన మీడియా మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంట్‌ను తొలగించేందుకే కేంద్రం విద్యుత్ బిల్లును తెస్తుందని మండిపడ్డారు. గతంలో పవర్ జోలికి వచ్చినవారు పవర్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీజేపీ అంటే భారతీయ బోగస్ పార్టీ అన్నారు. బీజేపీ రాష్ట్ర […]
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజా సంక్షేమం మోడీ సర్కార్‌కు గిట్టదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్ అసెంబ్లీ కార్యాలయంలో ఆయన మీడియా మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంట్‌ను తొలగించేందుకే కేంద్రం విద్యుత్ బిల్లును తెస్తుందని మండిపడ్డారు. గతంలో పవర్ జోలికి వచ్చినవారు పవర్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీజేపీ అంటే భారతీయ బోగస్ పార్టీ అన్నారు. బీజేపీ రాష్ట్ర నేతలకు దమ్ముంటే పసుపు బోర్డు తేవాలని సవాల్ విసిరారు. నిజామామాద్ ఎంపీ అరవింద్ ఓ ఫేక్ ఎంపీ అని విమర్శించారు. రాష్ట్రంపై బీజేపీ నేతలకు ప్రేమ ఉంటే కాళేశ్వరానికి జాతీయ హోదా ఇప్పించాలన్నారు. మోడీ ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాలేదని, దమ్ముంటే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వలేమని బహిరంగంగా చెప్పాలన్నారు. కేసీఆర్ కరెంట్ అంశంపైనే తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారన్నారు. కేసీఆర్ విధానాల వల్లే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరిగిందన్నారు. విద్యుత్ బిల్లుపై దక్షిణాది రాష్ట్రాలు ఉద్యమించ బోతున్నాయని, విద్యుత్ బిల్లుపై కాంగ్రెస్ నేతలు మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.