ప్రతిపక్షాలకు బంగాళాఖాతమే దిక్కు: దానం
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజలు ఎన్నిసార్లు ఛీకొట్టిన మారని ప్రతిపక్షాలకు ఇక బంగాళాఖాతమే దిక్కని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఎంపీ రేవంత్‌రెడ్డి తెలంగాణకు పట్టిన శని అని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు కళ్లుండి చూడలేని కబోధులుగా మారారని, హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాకే సచివాలయం కూల్చివేతలు మొదలు పెట్టడం జరిగిందన్నారు. సచివాలయంలో ప్రార్థనా మందిరాల కూల్చివేతపై సీఎం కేసీఆర్ ఇప్పటికే వివరణ ఇచ్చారన్నారు. ఎవరిని సీఎం చేయాలో […]
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజలు ఎన్నిసార్లు ఛీకొట్టిన మారని ప్రతిపక్షాలకు ఇక బంగాళాఖాతమే దిక్కని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఎంపీ రేవంత్‌రెడ్డి తెలంగాణకు పట్టిన శని అని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు కళ్లుండి చూడలేని కబోధులుగా మారారని, హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాకే సచివాలయం కూల్చివేతలు మొదలు పెట్టడం జరిగిందన్నారు. సచివాలయంలో ప్రార్థనా మందిరాల కూల్చివేతపై సీఎం కేసీఆర్ ఇప్పటికే వివరణ ఇచ్చారన్నారు. ఎవరిని సీఎం చేయాలో కేసీఆర్ పరిధిలోని అంశమని, దానిపై ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు లేదన్నారు.