భట్టి కాన్వాయ్‌ను అడ్డగించేందుకు టీఆర్ఎస్ నాయకులు యత్నం
దిశ, పాలేరు: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశం నేపథ్యంలో శుక్రవారం కూసుమంచికి వస్తున్న సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క కాన్వాయ్‌ని.. టీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాలేరు ఎమ్మెల్యే పై భట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేశారని వాటిని వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉపేందర్ రెడ్డి జిందాబాద్, భట్టి డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తమ నాయకుడైన కందాల ఉపేందర్ రెడ్డి ఎప్పుడు […]
దిశ, పాలేరు: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశం నేపథ్యంలో శుక్రవారం కూసుమంచికి వస్తున్న సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క కాన్వాయ్‌ని.. టీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాలేరు ఎమ్మెల్యే పై భట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేశారని వాటిని వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉపేందర్ రెడ్డి జిందాబాద్, భట్టి డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తమ నాయకుడైన కందాల ఉపేందర్ రెడ్డి ఎప్పుడు ప్రజా బహుళ్యంలో ఉండే అని, అటువంటి వ్యక్తి పై ఇటువంటి విమర్శలు చేయడం తగదన్నారు. అప్పటికే భట్టి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీనితో పోలీసులు అక్కడికి చేరుకొని గోడవను సద్దుమణిగించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, బెల్లం వేణు గోపాల్, ఆషిఫ్ పాషా, సీతారాములు, అలీ తదితరులు పాల్గొన్నారు.